కృతి సనన్ రాఖీ యాడ్‌పై దుమారం.. కంగనా షాకింగ్ కామెంట్స్

కృతి సనన్ నటించిన రక్షా బంధన్ యాడ్‌పై సోషల్ మీడియాలో వివాదం చెలరేగింది. ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ కోసం చేసిన ఈ యాడ్‌లో కృతి వేసుకున్న బట్టలపై కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇండియన్ ఫెస్టివల్‌ను ఇలా చూపించడం సరికాదని విమర్శించారు. దీనిపై బీజేపీ MP, నటి కంగనా రనౌత్ స్పందించారు. రాఖీ కట్టేందుకు బికినీ వేసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తూ.. యాడ్ చాలా అసహ్యంగా ఉందని విమర్శించారు. ఈ వివాదంపై కృతి ఇప్పటివరకు రెస్పాండ్ అవ్వలేదు.



