అందరికీ జాబ్స్ ఇవ్వడం అసాధ్యం: TGPSC ఛైర్మన్

TG: ఎంత ప్రయత్నించినా అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం ఎప్పటికీ సాధ్యం కాదని TGPSC ఛైర్మన్ బుర్రా వెంకటేశం అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల రిలీజ్ చేసిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 20 అసిస్టెంట్ సైంటిస్ట్ పోస్టులకు 19వేల అప్లికేషన్స్ వచ్చాయని, అంటే కేవలం 0.1% మందికే జాబ్స్ ఇవ్వగలమని, మిగతా 99.9% మందికి ఇవ్వలేమన్నారు. అసంతృప్తి సహజమని, అకారణంగా మాట్లాడేవారిని మీడియా, సొసైటీ కంట్రోల్ చేయాలని సూచించారు. TGPSCపై అసత్యాలు ప్రచారం చేసేవారు ఎప్పుడూ ఉంటారన్నారు.



