Chat GPTతో తిరుమల రూమ్ బుకింగ్!

AP: తిరుమలలో రూమ్ బుకింగ్‌ను AI ఏజెంట్ దాదాపు కంప్లీట్ చేసింది. ‘techbypavan’ అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసిన వీడియోలో ఈ విషయం తెలిసింది. డిసెంబర్ 21న తిరుమలలో రూమ్ బుక్ చేయాలని AI ఏజెంట్ ChatGPT ఆస్ట్రాకు PROMPT ఇవ్వగా అది, TTD వెబ్‌సైట్‌లోకి వెళ్లి అందుబాటులో ఉన్న ఆప్షన్లను ఎంచుకుంది. పేమెంట్ దశలో బ్యాంకు డీటైల్స్ లేకపోవడంతో ప్రాసెస్ ఆగిపోయింది. అయితే దర్శన టికెట్ లేకుండా రూమ్ బుకింగ్ సాధ్యం కాదని TTD ఐటీ అధికారులు తెలిపారు.



