విజయ్‌కు చెక్ పెట్టడానికి బద్ధ శత్రువులు ఒక్కటవుతారా ?

తమిళనాడులో రాజకీయం రోజుకొకలా మారుతోంది. ఒకే ఒక్కడు విజయ్ ని సీఎం కాకుండా అడ్డుకోవడానికి బద్ధశత్రువులైన DMK, AIADMK చేతులు కలిపేలా కనిపిస్తున్నాయి. AIADMKతో పొత్తుకి డీఎంకే ఒకే ఒక్క కండిషన్ పెట్టింది. మతతత్వ పార్టీ అయిన బీజేపీని వీడితే మద్దతు ఇస్తామని చెబుతోందని పార్టీ వర్గాల్ని ప్రస్తావిస్తూ నేషనల్ మీడియా కథనాలు రాస్తోంది. మరోవైపు డీఎంకే కూటమిలో ఉన్న లెఫ్ట్ పార్టీలు ఏఐఏడీఎంకేతో కలవడానికి సిద్ధంగా లేవు. ఇవాళ మధ్యాహ్నం సమావేశమై వామపక్ష పార్టీలు తుది నిర్ణయం తీసుకోనున్నాయి.



