← Back to news

విశాఖ ఉక్కు ప్రమాదం.. భయానక వాస్తవాలు

By DK· 9 Jun 2026· News18· విశాఖపట్నం జిల్లా
విశాఖ ఉక్కు ప్రమాదం.. భయానక వాస్తవాలు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదానికి కారణం ఉక్కు ద్రవం లీకు కావడం. ద్రవ ఉక్కు ఉష్ణోగ్రత ఎంత ప్రమాదమో ఈ ఘటన ద్వారా తెలుస్తుంది. ప్రమాద సమయంలో సుమారు 150టన్నుల ద్రవఉక్కు 1,540 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతతో లాడిల్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ ఉష్ణోగ్రత సాధారణ అగ్ని ప్రమాదాలతో పోల్చితే ఎన్నో రెట్లు ఎక్కువ. మనిషి చర్మం 60 నుంచి 70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతకే తీవ్రగాయాలకు గురవుతుంది. 100 డిగ్రీల వద్ద నీరు మరిగిపోతుంది. కానీ ఉక్కు కరిగే స్థాయి 1,500 డిగ్రీలకుపైగా ఉంటుంది. అలాంటి పరిస్థితిలో శరీరంపై పడితే బతికే అవకాశం ఉండదు.

More in AP