← Back to news

ఎర్రకోటపై 'వందేమాతరం' 150 ఏళ్ల పండగ!

By BK· 14 Aug 2026· India
ఎర్రకోటపై 'వందేమాతరం' 150 ఏళ్ల పండగ!

ఈ ఆగస్టు 15న మనదేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోబోతోంది. ఢిల్లీ ఎర్రకోటపై ప్రధాని మోదీ జెండా ఎగరేసి జాతిని ఉద్దేశించి మాట్లాడతారు. ఈసారి ప్రత్యేకత ఏంటంటే.. 'వందేమాతరం' 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చిన ఈ జాతీయ గేయాన్ని ఎర్రకోట బురుజుల నుంచి తొలిసారిగా పాడతారు. హెలికాప్టర్ ద్వారా పూలవాన కురిపిస్తూ వందేమాతరం బ్యానర్‌ను చూపిస్తారు. 'యువశక్తి'కి ప్రాధాన్యమిస్తూ 2,500 మంది NCC, మై భారత్ వాలంటీర్లు జ్ఞాన్‌పథ్‌లో ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నారు.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 10h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.