వచ్చే ఒలింపిక్స్‌లో సత్తా చాటాలి: మోదీ

నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఖేలో ఇండియా సంవాద్‌లో వర్చువల్‌గా పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా యువ అథ్లెట్లతో మాట్లాడారు. స్పోర్ట్స్ కేవలం మెడల్స్ కోసం కాదని, యువతలోని శక్తిని వెలికితీసే సాధనాలని అన్నారు. 5-15 ఏళ్ల పిల్లల్లో టాలెంట్‌ను గుర్తించి ఎంకరేజ్ చేయాలన్నారు. వచ్చే ఒలింపిక్స్‌లో భారత్ మరిన్ని మెడల్స్ సాధించేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఆ ఒలింపిక్స్‌లో భారత్ చెప్పుకోదగ్గ స్థాయిలో మెడల్స్ సాధించాలని ఆయన కోరారు.



