వృద్ధుడిపై రాయితో దాడి.. నిందితుడి అరెస్ట్

TG: వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతుల కోసం డబ్బుల వసూళ్ల విషయంలో మొదలైన వివాదం ఘర్షణకు దారితీసింది. రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం చెరుకుపల్లి రెవెన్యూ శివారులో వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో బైరంపల్లి రాములు (58)పై కార్తిక్ అలియాస్ వంశీ (22) రాయితో దాడి చేశాడు. రాములు నోటిలోని నాలుగు పళ్లు విరిగి తీవ్ర రక్తస్రావమైంది. కొందుర్గ్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కార్తిక్‌ను షాద్‌నగర్ కోర్టులో మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచినట్లు ఎస్‌హెచ్‌ఓ వరప్రసాద్ తెలిపారు.

