← Back to news

మతం మత్తులో కొట్టుకుపోతున్నాం: KTR

By dk· 15 Aug 2026· హైదరాబాద్
మతం మత్తులో కొట్టుకుపోతున్నాం: KTR

TG: స్వాతంత్ర్యం వచ్చి 80ఏళ్లు గడిచినా దేశంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడారు. దేశంలో ఇంకా నీళ్లు, రోడ్లు, కరెంటు లేని గ్రామాలు ఉన్నాయని, నాణ్యమైన విద్య అందక యువత విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. పాకిస్థాన్‌తో పోల్చుకుని గొప్పగా చెప్పుకోవడం కాకుండా భారత్‌లో ఏం సాధించాలో ఆలోచించాలన్నారు. మతం, ఎవరి దేవుడు గొప్ప అనే చర్చలకే పరిమితం కావద్దన్నారు.

More in TG