← Back to news

పెన్షన్ కోసం అత్త ని 3 కి.మీ మోసుకెళ్ళిన కోడలు!

By Subhash· 26 May 2026· Indiatimes· ఛత్తీస్గఢ్
పెన్షన్ కోసం అత్త ని 3 కి.మీ మోసుకెళ్ళిన కోడలు!

ఛత్తీస్‌గఢ్‌లో ఒక కోడలు తన 90 ఏళ్ల అత్తను వీపుపై మోసుకుని 3 కిలోమీటర్లు నడిచింది. కారణం ఏంటంటే, కేవలం ₹500 పెన్షన్ కోసం బ్యాంక్ వెళ్లాల్సి వచ్చింది. కేవైసీ (KYC) పెండింగ్‌లో ఉండటం వల్ల గత నాలుగు నెలలుగా పెన్షన్ ఆగిపోయింది. వేరే దారి లేక, ఆ కోడలు అలా అత్తను మోసుకుంటూ బ్యాంక్‌కు వెళ్ళింది. ఇది చూసిన నెటిజన్లు "సిస్టమ్ ఇంకా మారాలి" అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఆ కోడలి డెడికేషన్ మాత్రం నెక్స్ట్ లెవల్!

More in News