మీడియా తీరుపై ఆశుతోష్ రంకా అసంతృప్తి..

CJP ఆశుతోష్ రంకా మీడియా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తాను AAPలో పనిచేయడం, డొనేషన్ ఇవ్వడం పాత విషయమని, దాని ఆధారంగా క్లిక్ బైట్ హెడ్‌లైన్స్ రాస్తున్నారని మండిపడ్డారు. జర్నలిజంలో మినిమమ్ ఎథిక్స్ లేకుండా తన అడ్రస్, పాన్ కార్డ్ డీటైల్స్ పబ్లిక్‌గా షేర్ చేశారని ఫైర్ అయ్యారు. ఈ జర్నలిస్టుల బాధ్యతారాహిత్య చర్యల వల్ల ఇప్పుడు తన పేరెంట్స్ సెక్యూరిటీ త్రెట్ ఎదుర్కోవాల్సి వస్తోందని 'X' వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.



