దేశంలో పెట్రో ధర మండిపోతున్న నగరం ఏంటో తెలుసా ?

పది రోజుల్లో పెట్రో ధరలు ఏకంగా మూడు సార్లు పెరగడం వల్ల అత్యధిక ధర ఏ నగరంలో ఉందో తెలుసా ? అది మన హైదరాబాద్. దేశంలో లీటర్ పెట్రోల్ హైదరాబాద్ లో ఏకంగా రూ.113గా ఉంది. ఆ తర్వాత స్థానాల్లో తిరువనంతపురం, పాట్నా ఉన్నాయి.దీనికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం విధించే value added taxes వ్యాట్ పన్నులే. తెలంగాణలో పెట్రోల్‌పై 35.20% వ్యాట్ విధిస్తున్నారు, ఇది మిగతా మెట్రో నగరాల కంటే చాలా ఎక్కువ. దీనికి తోడు డీలర్ కమీషన్లు, రవాణా ఖర్చులు కూడా తోడవడంతో భాగ్యనగరంలో ఇంధన ధరలు మండిపోతున్నాయి.



