వినాయక వేడుకలపై దాచేపల్లిలో సమావేశం

AP: వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పల్నాడు జిల్లా దాచేపల్లి పోలీస్ స్టేషన్‌లో వినాయక నిమజ్జన కమిటీ సభ్యులతో పోలీసులు అవగాహన సమావేశం నిర్వహించారు. సీఐ ఖాసిం వలి, ఎస్‌ఐ పాపారావు సింగిల్ విండో విధానంపై వివరించారు. విగ్రహ ప్రతిష్ఠాపన, పూజలు, నిమజ్జనానికి అవసరమైన వివిధ శాఖల అనుమతుల కోసం ఒకేసారి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. నిమజ్జనం రోజులు, ఊరేగింపు మార్గం, నిమజ్జన ప్రదేశ వివరాలను ముందుగానే తెలియజేయాలని సూచించారు.



