22 జిల్లాల సర్వే.. రిపోర్ట్ లో ఏముంది?

తెలంగాణలో కౌలు రైతుల సమస్యలపై 'రైతు స్వరాజ్య వేదిక' ఆధ్వర్యంలో ఒక important సర్వే రిపోర్ట్ రిలీజ్ అయింది. 22 జిల్లాల్లో 1816 మంది కౌలు రైతులను ఇంటర్వ్యూ చేసి ఈ నివేదికను తయారు చేశారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి ప్రముఖులు ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు. కౌలు రైతులకు వెంటనే గుర్తింపు కార్డులు ఇచ్చి, అన్ని రకాల ప్రభుత్వ స్కీమ్స్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. 2011 భూ కౌలుదారుల చట్టాన్ని వెంటనే అమలు చేయాలని, CM దీనిపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని కోరారు.







