సచివాలయ ఉద్యోగులకు Good News!

AP: విజయవాడలో సచివాలయ ఉద్యోగుల 11 గంటల <a href="https://www.theclearcutnews.com/n/nmPdXuA">ధర్నా ముగిసింది.</a> ఉద్యోగుల ప్రమోషన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 815 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను గ్రేడ్-2 నుంచి గ్రేడ్-1కు అప్‌గ్రేడ్ చేయనుంది. నాలుగు కేటగిరీల ఉద్యోగులకు ప్రమోషన్లకు అనుమతి ఇచ్చినట్లు మంత్రి నారాయణ తెలిపారు. వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలకు ప్రమోషన్లు, వాటితో ఖాళీ అయ్యే పోస్టుల్లో డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలకు ప్రమోషన్లు ఇవ్వనున్నారు. దీంతో రెండు కేటగిరీల్లో 1,630 మందికి ప్రమోషన్ ఛాన్స్‌లు దక్కనున్నాయి.

