బ్యాంక్ ఉద్యోగుల సమ్మె వాయిదా.. కీలక నిర్ణయం!

సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు జరగాల్సిన ప్రభుత్వ రంగ బ్యాంక్ ఉద్యోగుల సమ్మె వాయిదా పడింది. యునైటెడ్ ఫోరమ్స్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU), ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) మధ్య ఆదివారం (నిన్న) రాత్రి జరిగిన చర్చలు సక్సెస్ కావడంతో సమ్మెను ప్రస్తుతానికి విరమించారు. శనివారాల సెలవు డిమాండ్‌పై హై-లెవల్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కమిటీ నిర్ణయం తర్వాత తదుపరి యాక్షన్‌పై బ్యాంక్ యూనియన్లు నిర్ణయం తీసుకోనున్నాయి.




