విద్యార్థినులపై హెడ్‌మాస్టర్ లైంగిక వేధింపులు!

బీహార్, నవాడా జిల్లా, సదర్ బ్లాక్‌లోని ఆనంద్‌పురా ఉత్క్రమిత మధ్య విద్యాలయంలో 52 ఏళ్ల హెడ్‌మాస్టర్ మహేష్ ప్రసాద్ యాదవ్‌పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఆయన బాత్‌రూమ్‌లోకి చొచ్చుకొని వచ్చి అనుచితంగా తాకడం, బలవంతంగా ఒడిలో కూర్చోబెట్టుకోవడం, జుట్టు లాగడం వంటి వేధింపులకు పాల్పడ్డారని 6వ నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న బాలికలు ఆరోపించారు. సెప్టెంబర్ 18న విద్యార్థినులు, తల్లిదండ్రులు స్కూల్లో నిరసన తెలిపారు. పోలీసులు పోక్సో చట్టం కింద ఆయనను అరెస్టు చేశారు.


