ఒక్కొక్కరికి కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి: KA పాల్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ డిమాండ్ చేశారు. CM చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి కుమార స్వామి తమ పదవులకు రాజీనామా చేయాలన్నారు. రూ. 10వేల కోట్ల నష్టాలతో స్టీల్ ప్లాంట్ నడుస్తోందని, నిధులు లేకనే భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు.



