కోల్ కతాలో టెన్షన్ టెన్షన్.. టీఎంసీ ఆఫీసుని కూల్చేసిన బుల్డోజర్లు
పశ్చిమ బెంగాల్ రిజల్ట్స్ తర్వాత బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. నిన్న అర్ధరాత్రి కోల్ కతాలోని హాగ్ మార్కెంట్ ప్రాంతంలో టీఎంసీ యూనియన్ ఆఫీసుని కొందరు వ్యక్తులు బుల్ డోజర్లతో కూల్చేశారు. వారి చేతుల్లో బీజేపీ , ఆరెస్సెస్ జెండాలు ఉన్నాయి. దీంతో రెండు పార్టీల కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. మరోవైపు కొందరు బీజేపీ కార్యకర్తలు మటన్ షాపులు మూసివేయాలంటూ వీధుల్లో తిరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది.



