ఎలాన్ మస్క్‌తో బంధం ముగిసింది

టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌తో తన బంధం ముగిసిందని న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్ శివోన్ జిలిస్ ప్రకటించారు. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండానే వారం రోజుల్లో బంధం ముగిసిందని ఆమె పోస్ట్‌లో తెలిపారు. ఈ నిర్ణయం తనకు బాధ కలిగించిందని చెప్పారు. మస్క్‌తో తమకు నలుగురు పిల్లలు ఉన్నారని అన్నారు. బంధం ముగిసినా పిల్లల కోసం ఇద్దరూ స్నేహితులుగా, కలిసి తల్లిదండ్రుల బాధ్యతలు నిర్వర్తించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మస్క్ తనను ఎక్స్‌లో అన్‌ఫాలో చేసిన తర్వాత జిలిస్ ఈ విషయాన్ని వెల్లడించారు.



