← Back to news

రాహుల్ గాంధీ ధర్నా చేసినా FIR నమోదుకు 8 గంటలు

By Subhash· 22 Aug 2026

ఢిల్లీ నిరసనల్లో పెల్లెట్ గన్ కాల్పుల్లో గాయపడ్డ విద్యార్థి సాహిల్ లోచబ్‌ శరీరంపై 200 పెల్లెట్స్ ఉన్నాయని మెడికల్ రిపోర్ట్ వచ్చింది. దీంతో సాహిల్ కు న్యాయం చేయాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు. FIR నమోదయ్యేదాకా కదిలేది లేదని పట్టుబట్టడంతో పోలీసులు FIR చేశారు. బాధితుడు సాహిల్ స్పందిస్తూ 'నా ఒంట్లో 200 గాయాలున్నా FIR కోసం 8 గంటలు పట్టింది. లోక్‌సభ ప్రతిపక్ష నేత (LOP) అండగా నిలబడకపోతే పోలీసులు అసలు కేసు నమోదు చేసే వారే కాదు" అని ఆవేదన వ్యక్తం చేశాడు.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 7h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.