← Back to news

సోమిరెడ్డిని కలిసిన ఆటో యూనియన్ నాయకులు

By KUCHIPUDI BUJJIBABU· 2h ago· Salivahanapeta, Mangalagiri, Guntur
సోమిరెడ్డిని కలిసిన ఆటో యూనియన్ నాయకులు

గుంటూరు జిల్లాలో వైసీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డి నియమితులైన సందర్భంగా AIIMS ఆటో యూనియన్ నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. వడ్డేశ్వరం, కొలనుకొండ, సిమెంట్ ఫ్యాక్టరీ ప్రాంతాలకు చెందిన ఆటో యూనియన్ నాయకులు మంగళగిరిలోని నియోజకవర్గ కార్యాలయానికి చేరుకుని వేణుగోపాల సోమిరెడ్డికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఆటో డ్రైవర్లు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు.

More in Local