CJP సౌరవ్ దాస్ కేసు Decemberకి వాయిదా!

ఢిల్లీ హైకోర్టు CJP సౌరవ్ దాస్ దాఖలు చేసిన కేసు విచారణను డిసెంబర్ 10కి వాయిదా వేసింది. అభిజిత్ అయ్యర్-మిత్రా, ది పాంప్లెట్, లా బీట్, ది జైపూర్ డైలాగ్స్, ది సండే గార్డియన్ తన పర్సనల్ ఇన్ఫర్మేషన్, హోమ్ అడ్రస్‌ను పబ్లిక్ డొమైన్‌లో పెట్టారని సౌరవ్ దాస్ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై డిఫెండెంట్స్ అందరూ ఆల్రెడీ తమ రిప్లై ఫైల్ చేశారని, దానికి రెస్పాన్స్ ఇచ్చేందుకు తనకు మరింత టైమ్ కావాలని సౌరవ్ దాస్ కోరడంతో కోర్టు విచారణను పోస్ట్‌పోన్ చేసింది.



