రోజూ ప్యాకెట్ ఫుడ్ తింటున్నారా? ఇవి తెలుసుకోండి

'అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్' అంటే ఫ్యాక్టరీల్లో ఎక్కువగా ప్రాసెస్ చేసి, తయారుచేసే ఆహారం. చిప్స్, ఇన్‌స్టంట్ నూడుల్స్, ప్యాకెట్ బిస్కెట్లు, కూల్‌డ్రింక్స్, కేకులు, రెడీ-టు-ఈట్ ఫుడ్స్ దీనికి ఉదాహరణలు. వీటిలో మైదా, చక్కెర, ఉప్పు, కొవ్వు, ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉండొచ్చు. వీటిని రోజూ ఎక్కువగా తింటే ఒబెసిటీ, టైప్-2 డయాబెటిస్, గుండె జబ్బులు వంటి ఆరోగ్య సమస్యల రిస్క్ పెరగవచ్చని స్టడీస్ చెబుతున్నాయి. అందుకే వీటిని లిమిట్ చేసి ఫ్రెష్ ఫుడ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.


