← Back to news

ఉపాధ్యాయుడి కుటుంబానికి ఆరులక్షల సాయం

By Dr.Kranthikumar· 2h ago· Munagala, Munagala, Suryapet
ఉపాధ్యాయుడి కుటుంబానికి ఆరులక్షల సాయం

సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలోని తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్‌లో PGT (ఇంగ్లీష్)గా పనిచేసిన తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కార్యకర్త కొండేటి సైదులు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుటుంబానికి ఫెడరేషన్ కుటుంబ సంక్షేమ నిధి పథకం కింద 6లక్షల చెక్కును రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి అందజేశారు. మునగాల తెలంగాణ మోడల్ స్కూల్‌లో నిర్వహించిన సంతాప కార్యక్రమంలో సైదులు సతీమణి నాగలక్ష్మికి చెక్కును అందించారు.

ఉపాధ్యాయుడి కుటుంబానికి ఆరులక్షల సాయం

More in Local