← Back to news

బ్యారీ భాష.. దీని గురించి విన్నారా?

By Vishi· 7h ago
బ్యారీ భాష.. దీని గురించి విన్నారా?

బ్యారీ భాష గురించి ఎప్పుడైనా విన్నారా? కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లో, కేరళలోని కాసరగోడ్ జిల్లాలో సుమారు పదిహేను లక్షల మంది ఈ భాష మాట్లాడతారు. వీళ్లు ఎక్కువగా బ్యారీ ముస్లిం సమాజానికి చెందినవారు. తుళు భాషలో ‘బ్యార’ అంటే వ్యాపారం అని అర్థం. బ్యారీ సమాజం చాలాకాలం నుంచి వ్యాపారం చేసేవారు. అందుకే వాళ్లని ‘బ్యారీలు’ అని పిలిచారు. బ్యారీ భాషలో మలయాళం, తుళు, అరబిక్, కన్నడ పదాలు కలిసి ఉంటాయి. ఈ భాషకు లిపి లేదు. కన్నడ లేదా మలయాళం లిపిలో రాస్తారు.

More in Infotainment