పెన్షన్ కోసం వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన

TG : పింఛన్ రావడం లేదని కంచర్ల గ్రామానికి చెందిన గొల్ల రాములు నిరసనగా వాటర్ ట్యాంక్ ఎక్కాడు. రెండు గంటల పాటు ట్యాంక్‌పైనే ఉన్న ఆయనను పోలీసులు, గ్రామస్తులు నచ్చజెప్పి కిందకు దించారు. గతంలో వచ్చిన పెన్షన్ ఇప్పుడు రావడం లేదని, అర్హత ఉన్నా ఇవ్వడం లేదని రాములు బాధపడ్డారు. సదరం సర్టిఫికెట్ లేకపోవడం వల్లే పింఛన్ ఆగిపోయినట్లు స్థానికులు చెప్పారు. సమస్య తీర్చకపోతే ప్రాణాలు తీసుకుంటానని రాములు అనడంతో అధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయాలని ఊరి జనం కోరుతున్నారు.



