బొల్లారం ఆయుధాల కేసులో 7 అరెస్టులు

సికింద్రాబాద్‌లోని బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ప్రధాన నిందితుడు మల్లేశ్ ఇచ్చిన సమాచారంతో మొత్తం ఏడుగురిని అరెస్టు చేశారు. నిందితుల్లో ముగ్గురు ఆర్మీలో పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఆయుధాలను బ్యాంకులు, నగల దుకాణాల్లో దోపిడీలకు వినియోగించేందుకు కుట్ర చేసినట్లు దర్యాప్తులో తేలింది. పిస్టల్‌కు రూ.3 లక్షలు, లాంగ్ వెపన్‌కు రూ.5 లక్షల చొప్పున ఒప్పందం కుదిరినట్లు పోలీసులు తెలిపారు.


