← Back to news

కంచరపాలెంలో యువకుడి మృతి.. కేసు నమోదు

By Bala· 2h ago
కంచరపాలెంలో యువకుడి మృతి.. కేసు నమోదు

విశాఖపట్నం కంచరపాలెంలో యువకుడి మృతి విషాదం నింపింది. కప్పరాడ రామకృష్ణనగర్‌కు చెందిన కార్తీక్‌ (22) డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి ఇంటికి వచ్చిన అతడు కుటుంబ సభ్యులతో మాట్లాడిన అనంతరం ఒంటరిగా ఉన్నాడు. కొద్దిసేపటికి అతడు ఇంట్లో అపస్మారక స్థితిలో కనిపించడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

More in Local