16 ఏళ్ల విద్యార్థి.. టీబీకి కొత్త రక్త పరీక్ష

అమెరికాకు చెందిన 16 ఏళ్ల ఆస్టిన్ జిన్ టీబీ(క్షయవ్యాధి)ని గుర్తించేందుకు కొత్త రక్త పరీక్షను అభివృద్ధి చేశాడు. CRISPR టెక్నాలజీతో రూపొందించిన ఈ టెస్ట్‌తో టీబీతోపాటు మందులకు లొంగని రకాలను కూడా గుర్తించవచ్చని చెబుతున్నారు. M-CATCH పేరుతో తయారు చేసిన ఈ పరీక్షపై జిన్ పరిశోధన చేశాడు. అతడి ప్రతిభకు 2026 డేవిడ్సన్ ఫెలోషిప్‌తోపాటు 42 లక్షల రూపాయల స్కాలర్‌షిప్ లభించింది. ఈ పరీక్ష టీబీని త్వరగా గుర్తించడంలో ఉపయోగపడే అవకాశం ఉంది.



