ఆల్కహాల్ బదులుగా మందులు..ఏంటిది?

ఆల్కహాల్ బదులు కొందరు యువత ప్రిస్క్రిప్షన్ మందులను ఉపయోగిస్తున్నట్లు బీబీసీ కథనం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా యువతలో ఈ ట్రెండ్ కనిపిస్తోంది. సోషల్ యాంగ్జైటీ తగ్గించుకునేందుకు ప్రెగాబాలిన్, ప్రొప్రనాలోల్ లాంటి మందుల గురించి కొందరు సోషల్ మీడియా ద్వారా తెలుసుకుని వాటిని వాడుతున్నారు. ఆల్కహాల్ వల్ల వచ్చే హ్యాంగోవర్ ఉండదనే కారణంతో వీటివైపు ఆకర్షితులవుతున్నారు. అయితే డాక్టర్ ప్రిస్ర్కిప్షన్ లేకుండా వాడితే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లాంగ్ టర్మ్ వాడితే మందులపై ఆధారపడే ప్రమాదం ఉందంటున్నారు.



