కర్ణాటక కరువుపై.. మోడీకి ఖర్గే లెటర్

కర్ణాటకలో తీవ్ర కరువు పరిస్థితులపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని మోడీకి లెటర్ రాశారు. సెప్టెంబర్ వరకు సాధారణం కంటే 58 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని, పంట నష్టాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అంచనా నష్టం 18,748 కోట్ల 23 లక్షలు కాగా. NDRF, SDRF ఫండ్స్ కింద 3,705 కోట్ల 30 లక్షల సాయం కోరింది. చిన్న, సన్నకారు రైతులకు సాయం అందించడంతోపాటు కరువు ప్రభావిత ప్రాంతాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఖర్గే కోరారు.
