మా తప్పు లేదంటోంది.. కానీ ₹47 వేల కోట్లు మాత్రం ఇస్తోంది!

"తప్పు చేయలేదంటోంది అయినా ₹47 వేల కోట్లు ఎందుకు చెల్లిస్తోంది?" ఇదే ఇప్పుడు Johnson & Johnsonపై చర్చ. అమెరికాలో టాల్క్ ఆధారిత బేబీ పౌడర్, ఇతర ఉత్పత్తులు అండాశయ క్యాన్సర్‌కు కారణమయ్యాయని చెబుతూ వేలాది మంది మహిళలు కేసులు వేశారు. అయితే తమ ఉత్పత్తులు సురక్షితమేనని కంపెనీ చెబుతోంది. అయినప్పటికీ, 76 వేల కేసుల పరిష్కారం కోసం 5.5 బిలియన్ డాలర్లు (సుమారు ₹47–48 వేల కోట్లు) చెల్లించే ప్రతిపాదన చేసింది. అయితే ఇది తప్పు ఒప్పుకోవడం కాదని, కోర్టు పోరాటానికి ముగింపు పలకడానికేనని స్పష్టం చేసింది.



