ఖైరతాబాద్ గణేశుడి రూపశిల్పి ఈయనే!

TG: ఖైరతాబాద్ గణేశుని ప్రధాన డిజైనర్ చిన్నస్వామి రాజేంద్రన్ 1978 నుంచి ఈ విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. అప్పట్లో NTR ‘దాన వీర సూర కర్ణ’ సినిమా సెట్లు రూపొందిస్తూ రామకృష్ణ స్టూడియోలో పనిచేస్తూ.. తొలిసారి 9 అడుగుల విగ్రహాన్ని చేశారు. ఏటా అది కొనసాగుతోంది. థీమ్ నిర్ణయించాక.. తమిళనాడు, AP, TG, ఒడిశా, బెంగాల్ ఆర్టిస్టుల టీమ్ 3 నెలలపాటు పనిచేస్తుంది. ఆ టైంలో రోజుకు ఒక్కసారే భోజనం, Non-Vegకి దూరంగా ఉంటారు. ఈ ఏజ్ లోనూ చిన్నస్వామి అదే జోష్ కొనసాగిస్తున్నారు.

