← Back to news

కుటుంబంతో సీఎం రేవంత్ గణపతి పూజ

By Balasaidul· 1h ago· TG

TG: వినాయక చవితి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జూబ్లీహిల్స్‌లోని ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరి జీవితాల్లో విఘ్నాలు తొలగి, విజయాలు కలగాలని ఆయన ప్రార్థించారు. ఈ సందర్భంగా సీఎం మరోసారి రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబంతో కలిసి భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ పూజలు ప్రజల మనోభీష్టాలు నెరవేరాలనే ఆకాంక్షతో చేసినట్లు తెలిపారు.

More in TG