ఆమెను కాదు.. తాజ్‌మహల్‌ను చూడండి!
తాజ్‌మహల్ దగ్గర ఓ విదేశీ టూరిస్ట్ ఫొటోలు దిగుతుండగా.. కొందరు యువకులు ఆమెను చూస్తూ అక్కడే నిల్చున్నారు. ఇది గమనించిన ఫొటోగ్రాఫర్ వెంటనే వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరాడు. ‘‘తాజ్‌మహల్ చూడటానికి వచ్చారు.. దాన్ని చూడండి. ఆమె ఇబ్బందిగా ఫీల్ అయ్యేలా ఎందుకు చేస్తున్నారు?’’ అని మందలించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారి 39 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. ఫొటోగ్రాఫర్ తీరును నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. మీరేమంటారు? కామెంట్ చెయ్యండి.


