← Back to news

13 రోజుల చిన్నారికి పాస్‌పోర్ట్..సరికొత్త రికార్డ్

By Vishi· 2h ago
13 రోజుల చిన్నారికి పాస్‌పోర్ట్..సరికొత్త రికార్డ్

AP: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం దాసన్నపేటకు చెందిన వజ్రపు అగస్య ప్రిన్సీ పుట్టిన 13 రోజులకే పాస్‌పోర్ట్ పొందింది. దీంతో తన పేరు International Book of Recordsలో ‘యంగెస్ట్ పాస్‌పోర్ట్ హోల్డర్’గా నమోదైంది. గతంలో ఈ రికార్డు 19 రోజుల చిన్నారి పేరు మీద ఉండేది. 2026 మే 30న తన అమ్మమ్మగారి ఊరైన రాజమహేంద్రవరంలో పుట్టిన ప్రిన్సీ సరిగ్గా జూన్ 12వ తేదీన పాస్‌పోర్టు పొందింది. ప్రిన్సీ తండ్రి ఆశిష్ లండన్‌లో పాస్టర్‌. మొత్తం కుటుంబం లండన్ వెళ్లాల్సి ఉండటంతో వేగంగా పాస్‌పోర్ట్ తీసుకున్నారు.

More in AP