పెళ్లయిన గంటకే హెలికాఫ్టర్ ప్రమాదంలో వరుడు మృతి

ఎంతో హ్యాపీగా గడపాల్సిన లైఫ్ కొన్ని గంటల్లోనే ముగిసిపోయింది. అప్పటివరకు పెళ్లి వేడుకల్లో ఆనందంగా గడిపిన ఆ భారతీయ మూలాలున్న కుటుంబం ఇంట తీవ్రవిషాదం నెలకొంది. కేరళ మూలాలున్న 25 ఏళ్ల డెల్టా ఎయిర్‌లైన్స్ పైలట్ డేవ్ ఫిజీ పెళ్లయిన మూడు గంటలకే మరణించాడు. అమెరికాలోని జార్జియా నుంచి అట్లాంటాకు హెలికాఫ్టర్ లో ఆ జంట హానిమూన్ కోసం బయల్దేరారు. ప్రతికూల వాతావరణంతో హెలికాఫ్టర్ కుప్పకూలిపోవడంతో డేవ్, మరో పైలెట్ అక్కడికక్కడే మరణించారు. తీవ్ర గాయాలతో బయటపడిన జెస్నీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
