← Back to news

వృద్ధాప్యానికి చెక్ పెట్టాలన్న బిలియనీర్

By Nani· 24 Jul 2026
వృద్ధాప్యానికి చెక్ పెట్టాలన్న బిలియనీర్

అమెరికన్ టెక్ బిలియనీర్ బ్రయాన్ జాన్సన్ తాను ల్యాబ్‌లో తన సొంత 'బేబీ క్లోన్'ను సృష్టించినట్లు ప్రకటించారు. తన శరీర కణాలను పిండ దశకు మార్చి, భవిష్యత్తులో కొత్త అవయవాల తయారీ, ఔషధాల పరీక్షలు, యవ్వన కణాల చికిత్స కోసం ఉపయోగించాలనే లక్ష్యంతో ఈ ప్రయోగం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు మానవ క్లోనింగ్ విజయవంతమైందని శాస్త్రీయ ఆధారాలు లేవు. దీంతో బ్రయాన్ చేసిన ఈ ప్రకటనపై శాస్త్రవేత్తలు, నెటిజన్లలో తీవ్ర చర్చ సాగుతోంది.

More in Science

నిద్రలో ఒక్కసారిగా కింద పడుతున్నట్టు ఎందుకు అనిపిస్తుంది? 💤
Science· 21 Aug 2026

నిద్రలో ఒక్కసారిగా కింద పడుతున్నట్టు ఎందుకు అనిపిస్తుంది? 💤

నిద్రలోకి జారుకుంటున్నప్పుడు ఒక్కసారిగా కింద పడుతున్నట్టు అనిపించి ఉలిక్కిపడటం చాలామందికి జరుగుతుంది. దీనిని ‘హిప్నిక్ జర్క్’ అంటారు. నిద్రలోకి మారే సమయంలో కండరాలు ఒక్కసారిగా జర్క్ అవడం వల్ల ఈ అనుభూతి వస్తుంది. మనం నిజంగా పడిపోతున్నామని కాదు.. మెదడు, శరీరం మేల్కొనే స్థితి నుంచి నిద్రలోకి మారుతున్న సమయంలో వచ్చే సహజ స్పందన ఇది. ఒత్తిడి, నిద్రలేమి, ఎక్కువ కెఫీన్ వంటివి దీన్ని మరింత పెంచొచ్చని డాక్టర్లు చెబుతున్నారు. అప్పుడప్పుడు ఇలా జరగడం సాధారణమే. మీకు కూడా ఇలా జరిగిందా? కామెంట్‌లో చెప్పండి. 👇