జలదిగ్బంధంలో గ్రామాలు.. పడవల్లోనే ప్రయాణం

AP: అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి కాజ్‌వే వరద నీటిలో మునిగిపోయింది. కాజ్‌వేపై రెండు అడుగుల మేర నీరు ప్రవహించడంతో అప్పనపల్లి, బి.దొడ్డవరం, పెదపట్నం లంక గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో మూడు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు బందోబస్తు ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు. మరోవైపు చాకలిపాలెం, కనకాయలంక, ఎదురుబిడియం కాజ్వేలు కూడా మునిగిపోవడంతో లంక గ్రామాల ప్రజల కోసం పడవలను ఏర్పాటుచేసి రవాణా కొనసాగిస్తున్నారు.



