విజయ్ కు కాంగ్రెస్ మద్దతు , 2 మంత్రి పదవుల కోసం డిమాండ్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన విజయ్ నేతృత్వంలోని TVKకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తామని అయితే రెండు మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. మేజిక్ ఫిగర్ కు విజయ్ పార్టీ కేవలం 10 సీట్ల దూరంలో నిలిచింది. కాంగ్రెస్ అయిదు స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ మద్దతు తీసుకుంటే మెజార్టీకి మరో 5 స్థానాలు కావాలి. లెఫ్ట్ పార్టీలు చెరో రెండు సీట్లలో గెలిచారు. ఇంకా చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి. వాటి సాయంతో విజయ్ సర్కార్ ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.



