నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు కీలకం

TG: నేరాల నియంత్రణతో పాటు గ్రామాల భద్రతకు సీసీ కెమెరాలు కీలకంగా పనిచేస్తాయని డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు అన్నారు. యాదాద్రిభువనగిరి జిల్లా మోటకొండూరు మండలం నాంచారిపేట గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన 11 సీసీటీవీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ గ్రామాల్లో అనుమానాస్పద కదలికలను గుర్తించడంతో పాటు నేరాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం స్థానికులు ముందుకు రావాలని సూచించారు.




