ఐఐటీ బాంబేలో నిరసనల ఎఫెక్ట్.. 18 డిమాండ్లపై డైరెక్టర్ సంతకం

సాహిల్ వాకోడే అనే స్టూడెంట్ మృతి తర్వాత IIT బాంబేలో 3 రోజులుగా విద్యార్థుల నిరసన కొనసాగింది. డైరెక్టర్ షిరీష్ కేదారే విద్యార్థులు పెట్టిన 18 డిమాండ్ల లిస్ట్‌పై సంతకం చేశారు. సాహిల్ మృతిపై ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్, ప్రొఫెసర్లకు కోడ్ ఆఫ్ కండక్ట్, స్టూడెంట్స్‌కు మెరుగైన మెంటల్ హెల్త్ సపోర్ట్ వంటి డిమాండ్లు ఇందులో ఉన్నాయి. సెప్టెంబర్ 26లోగా ఇంప్లిమెంటేషన్ ప్లాన్ ఇవ్వాలని విద్యార్థులు కోరారు. అయితే డిమాండ్లపై సంతకం చేసినా అవన్నీ వెంటనే అమలు కావని IIT తెలిపింది.



