← Back to news

పాకిస్థాన్‌లో బాంబు పేలి.. 15 మంది మృతి

By Vishi· 3h ago· X

పాకిస్థాన్‌లో బాంబు పేలింది. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రాంతంలోని కోహాట్ జిల్లాలో పోలీసు కాంపౌండ్‌లో ఉన్న మసీదులో బాంబు పేలింది. ఆ టైంలో మసీదులో 50 మందికి పైగా వ్యక్తులుండగా, అందులో 15 మందికిపైగా మరణించారు. 21 మంది గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఆసుపత్రులకు తరలించారు. అయితే ఆత్మాహుత బాంబు దాడా, లేదా ఎవరైనా అక్కడ బాంబు ఏర్పాటు చేశారా అనేది ఇంకా తెలియలేదు.

More in International