దిల్లీలో 500 మీటర్లు బైక్‌ను ఈడ్చుకెళ్లిన కారు
దిల్లీలోని ఆర్కే పురం సెక్టార్-3లో కారు బైకర్‌ను ఢీకొట్టిన ఘటన కలకలం రేపింది. ప్రమాదం తర్వాత కారు డ్రైవర్ బైక్‌ను దాదాపు 500 మీటర్ల దూరం లాగుకుంటూ వెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనపై హిట్ అండ్ రన్ ఆరోపణలు వస్తున్నాయి. డ్రైవర్ డ్రింక్ చేసి వాహనం నడిపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. DL10CZ 7812 నంబర్ కారుపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.


