నోలన్‌కు నచ్చిన సత్యజిత్ రే సినిమాలు

హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టఫర్ నోలన్‌కు మన దేశానికి చెందిన సత్యజిత్ రే సినిమాలు బాగా నచ్చాయంట. నోలన్ రీసెంట్‌గా న్యూయార్క్‌లోని క్రైటీరియాన్ క్లోజెట్‌కు వెళ్లారు. అక్కడి సినిమాల కలెక్షన్ నుంచి నోలన్ సత్యజిత్ రే తీసిన ‘ది అపూ ట్రైలాజీ’ని ప్రత్యేకంగా ఎంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ 'సత్యజిత్ రే తీసిన ‘పథేర్ పాంచాలి’ సినిమా చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆ ట్రైలాజీలో ఉన్న మిగతా రెండు సినిమాలు నేను ఇంకా చూడలేదు. ఆ రెండు సినిమాలను ఇంటికి తీసుకెళ్లి మొత్తం కథను పూర్తిగా చూస్తాను' అని ఒక వీడియోలో చెప్పారు.



