నీటిలో చిక్కుకున్న స్కూల్ బస్సు

భారీ వర్షంతో రోడ్లపై నీరు చేరడంతో గురుగ్రామ్‌లో స్కూల్ బస్సులు మధ్యలోనే ఆగిపోయాయి. ఒక బస్సులో పిల్లలు దాదాపు నాలుగు గంటల పాటు చిక్కుకుపోయారు. 👀 తల్లిదండ్రులు స్కూల్, అధికారులకు వరుసగా ఫోన్లు చేస్తుండగా.. నీరు ఎక్కువగా ఉండటంతో సాధారణ వాహనాలు అక్కడికి చేరలేకపోయాయి. చివరికి అధికారులు క్రేన్‌ను తీసుకొచ్చి బస్సును ముందుకు జరిపారు. ఆ తర్వాత పిల్లలను మరో బస్సులోకి మార్చి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనతో తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.



