ఖాళీ స్థలాల్లో చెత్త.. ప్రజలకు ఇబ్బందులు

TG: గ్రేటర్ వరంగల్ నగర పాలక సంస్థ పరిధిలో ఖాళీ స్థలాలు చెత్తకుప్పలుగా మారుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల మధ్య ఖాళీ స్థలాల్లో ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. వర్షం పడితే అక్కడ నీరు నిలిచి దోమలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. దీంతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఖాళీ స్థలాలను శుభ్రంగా ఉంచేలా అధికారులు చర్యలను తీసుకోవాలని కోరుతున్నారు. రూల్స్ పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.



