పేడ, చెత్తతో గ్యాస్.. కేంద్రం భారీ ప్లాన్!

పశువుల పేడ, పొలాల్లో మిగిలే వ్యర్థాలు, సేంద్రియ చెత్తను వృథాగా పడేయకుండా వాటితో గ్యాస్ తయారు చేయడానికి కేంద్రం ప్లాన్ చేసింది. ఇందుకోసం 23,731 కోట్లతో ‘గోబర్ధన్’ పథకానికి కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ పథకం 2026-27 నుంచి 2035-36 వరకు కొనసాగుతుంది. తయారయ్యే సీబీజీ గ్యాస్‌ను ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేయనుంది. ఒక్క కిలో గ్యాస్‌పై 10 రూపాయల వరకు,కొత్త గ్యాస్ ప్లాంట్లకు రూ.30 కోట్ల వరకు ఆర్థిక సాయం ఇవ్వనుంది. చెత్తను గ్యాస్‌గా మార్చడం, కాలుష్యాన్ని తగ్గించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం.


