త్వరలో ‘ఆపరేషన్ బ్లూ కోడ్’: కల్వకుంట్ల కవిత
TG: భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లోని SNCU వార్డులో సీలింగ్ భాగం కూలిందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. ఆ టైంలో వార్డులో చిన్నారులు లేకపోవడంతో ప్రమాదం తప్పిందన్నారు. ఆదిలాబాద్ RIMSలో అగ్ని ప్రమాదంలో ఐదుగురు శిశువులు మృతి చెందిన ఘటనను ఆమె ప్రస్తావించారు. హాస్పిటల్లో మౌలిక వసతులపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. హాస్పిటల్లను సందర్శించి పరిస్థితులను పరిశీలించేందుకు ‘ఆపరేషన్ బ్లూకోడ్’ చేపడతామని ప్రకటించారు.


